నలుగురు దేశీదారు విక్రేతల అరెస్ట్
తాంసి: భీంపూర్ మండలం అర్లి(టి) పంచాయతీ పరిధిలోని మందపల్లిలో నలుగురు దేశీదారు విక్రేతలను అరెస్టు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. సోమవారం మహారాష్ట్రలోని మాండ్వి నుంచి దేశీదారు తీసుకువస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు గ్రామశివారులో పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్, ఆశీష్ జైస్వాల్, కుంభేకర్ ప్రభాకర్, ఆత్రం కృష్ణను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 90 ఎమ్‌ఎల్ బాటిళ్లు 196 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మద్యం బాటిళ్లను సీజ్ చేసి నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలి పారు. సమావేశంలో ఏఎస్సై ముంతాజ్, సిరాజ్, సిబ్బంది దినేశ్, మధుకర్, రవీందర్ పాల్గొన్నారు.


