
ఎస్బీఐ కుంభకోణంపై సీన్ రీకన్‌స్ట్రక్షన్
చెన్నూర్: చెన్నూర్ ఎస్బీఐలో గత నెల 23న జరిగిన కుంభకోణంపై పోలీసులు గురువారం సీన్ రీ కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. 20.250 కిలోల బంగారు ఆభరణాలు, రూ.1.10 కోట్ల నగదు కుంభకోణం జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులు క్యాషి యర్ నరిగే రవీందర్, మేనేజర్ మనోహర్‌రెడ్డి, తాత్కాలిక ఉద్యోగి లక్కాకుల సందీప్‌లను జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ దేవేందర్‌రావు ఆధ్వర్యంలో బ్యాంక్‌కు తీసుకొచ్చారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తూ సుమారు మూడు గంటలపాటు విచారణ నిర్వహించారు. ముఖ్యంగా ఏటీఎంలో అకౌంట్ మేనేజ్‌మెంట్ ఎలా చేశారు, ఏటీఎంలలో తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువగా రికార్డులు మార్చినట్లు చేయడం విచారణలో తేలినట్లు తెలిసింది. ఫేక్‌లోన్ డాక్యుమెంట్‌ను పరిశీలించి ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు, ఎస్సైలు పాల్గొన్నారు.