కోలిండియా పోటీలకు బాడీ బిల్డర్ల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

కోలిండియా పోటీలకు బాడీ బిల్డర్ల ఎంపిక

Sep 25 2025 12:25 PM | Updated on Sep 25 2025 12:25 PM

కోలిం

కోలిండియా పోటీలకు బాడీ బిల్డర్ల ఎంపిక

బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన ఇద్దరు బాడీ బిల్డర్లు కోలిండియా బాడీబిల్డింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సీఈఆర్‌ క్లబ్‌లో మంగళవారం రాత్రి సింగరేణి కంపెనీ స్థాయి బాడీ బిల్డింగ్‌ పోటీలు నిర్వహించారు. సింగరేణి ఉద్యోగులు జనగామ మొగిలి 75కిలోల విభాగంలో, పెసరి అర్జున్‌ 70కిలోల విభాగంలో పాల్గొని ప్రథమ బహుమతి గెల్చుకున్నారు. కోలిండియా స్థాయి బాడీ బిల్డింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ పోటీలు వచ్చే అక్టోబర్‌లో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరగనున్నాయి. ఇద్దరు బాడీ బిల్డర్లను స్కైజిమ్‌ కోచ్‌ సదానందం, జిమ్‌ నిర్వాహకులు బాలకృష్ణ, చంద్రశేఖర్‌, క్రీడాకారులు అభినందించారు.

మందమర్రి క్రీడాకారులు..

మందమర్రిరూరల్‌: కోలిండియా పోటీలకు మందమర్రి ఏరియా క్రీడాకారులు ఎంపికయ్యారు. మందమర్రి వర్క్‌షాపులో ఈఎఫ్‌ఎం విధులు నిర్వరిస్తున్న బత్తుల వెంకటస్వామి బాడీ బిల్డింగ్‌(95 కిలోల విభాగం)లో, కాసిపేట–1 గనిలో పంపు ఆపరేటర్‌ బెల్లం అరుణ్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌(79 కిలోల విభాగం)లో బంగారు పతకాలు సాధించారు. వారిని కోలిండియా పోటీలకు ఎంపిక చేశారు. ఏరియా జీఎం రాధాకృష్ణ, ఎస్వో టు జీఎం జయప్రసాద్‌, శ్యామ్‌సుందర్‌, శివకృష్ణ అభినందించారు.

కోలిండియా పోటీలకు బాడీ బిల్డర్ల ఎంపిక
1
1/1

కోలిండియా పోటీలకు బాడీ బిల్డర్ల ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement