లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలి | - | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలి

Sep 28 2025 6:56 AM | Updated on Sep 28 2025 6:56 AM

లక్ష్

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలి

మంచిర్యాలఅగ్రికల్చర్‌: నిజాం నిరంకుశ పా లనను వ్యతిరేకించిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ సూచించారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబ డిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటా నికి కలెక్టర్‌ పూలమాల వేసి నివాళులర్పించా రు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలి వేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో తనవంతు పాత్ర పోషించారని కొనియాడారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మంచిర్యాలక్రైం: రామగుండం పోలీస్‌ కమి షనరేట్‌ ఆవరణలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవ లను కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ అడ్మిన్‌ శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ భీమేశ్‌, ఐటీ కోర్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, ఆర్‌ఐలు దామోదర్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, సీసీ హరీశ్‌, సీపీవో సిబ్బంది, వివిధ విభాగాలు, ఏఆర్‌ సిబ్బంది పాల్గొన్నారు.

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలి
1
1/1

లక్ష్మణ్‌ బాపూజీ ఆశయాలను సాధించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement