
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
కోటపల్లి: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటేల్ కాలనీ సాధన డిఫెన్స్ స్పోర్ట్స్ అకాడమీలో నిర్వహించిన 35వ సబ్‌జూని యర్ జిల్లా ఎంపిక పో టీల్లో మండలంలోని పార్‌పల్లి గ్రామానికి చెందిన తలారి రఘువర్ధన్ అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈనెల 26నుంచి 28వరకు నిజామాబాద్ జిల్లా ముస్కల్‌లో నిర్వహించనున్న 35వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు నుంచి పాల్గొననున్నట్లు కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ రామచంద్రం, కోచ్ బోగే ప్రేమ్ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న రఘువర్ధన్‌ను గ్రామస్తులు, క్రీడాకారులు అభినందించారు.