
ఫిర్యాదులపై స్పందించాలి
నస్పూర్: ఫిర్యాదులపై సత్వరమే స్పందించా లని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. శనివారం ఆయన శ్రీరాంపూర్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. సిబ్బంది పనితీరు, మహిళా సిబ్బంది సమస్యలు తెలుసుకున్నారు. క్రైమ్, లా అండ్ ఆర్డర్, సీసీ కెమెరాల పనితీరు గురించి ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ.. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట సీఐ వేణుచందర్, ఎస్సై సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.