
రక్తదానం మహాదానం
జైపూర్: రక్తదానం మహా దానమని ఎస్టీపీపీ సీఐఎస్‌ఎఫ్ కమాండెంట్ చంచల్ సర్కార్ పే ర్కొన్నారు. జైపూర్ ఎస్టీపీపీలో జాతీయ రక్తదా న దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని శనివారం అసిస్టెంట్ సుధీశ్ జాకర్, ఇన్‌స్పెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, దివార్‌తో కలిసి ప్రారంభించారు. అధికా రులు, ఉద్యోగులు అధికసంఖ్యలో రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్ని మంచిర్యాల రెడ్‌క్రాస్ సొసైటీ బ్లెడ్‌బ్యాంక్‌కు అందించారు. తలసేమియా పిల్లలకు ఉచితంగా అందజేయాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఎంసీ మెంబర్ కాసర్ల శ్రీనివాస్, బ్లడ్‌బ్యాంక్ సిబ్బంది సురేశ్, శిరీష, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.