
అంతరాయం ఉండొద్దు
విద్యుత్ సరఫరాలో
కలెక్టర్ రాహుల్‌రాజ్
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ కష్టాలు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
హవేళిఘణాపూర్(మెదక్): వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నందున, ముందస్తు జాగ్రత్తలతో అప్రమత్తంగా ఉండి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ మండలం మంభోజిపల్లి 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా ఇన్‌పుట్, అవుట్‌పుట్, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల గురించి విద్యుత్ శాఖ ఎస్‌ఈ శంకర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించడంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే వేసవిలో విద్యుత్ వినియోగం పెరిగే అవకాశమున్నందున, ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, ఇతర సాంకేతిక పరంగా ఎదురయ్యే లోపాలుంటే సరిచేసుకోవాలన్నారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం, లోడ్ మేనేజ్‌మెంట్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం వంటి చర్యలను అమలు చేయాలని చెప్పారు. జిల్లాలో 33/11 కేవీ ఉప విద్యుత్ కేంద్రాలు 126 ఉన్నాయని, వాటి పరిధిలో ప్రతి రోజు విద్యుత్ వినియోగం నమోదు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా, వ్యవసాయ, పారిశ్రామిక, గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.
చిన్నశంకరంపేట(మెదక్): కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. కరెంట్ కష్టాలు తెచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నార్సింగి మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ బ్రేక్‌డౌన్ కాగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగి పంటలకు కరెంట్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు సైతం నిర్మించలేని పరిస్థితిలో ఉందన్నారు. మార్పు పేరుతో అధికారంలోకి వచ్చి ఆనాటి కరెంట్ కష్టాలను ప్రజలకు చూపిస్తున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్ నీటిని పంటలకు అందించి రైతుల ఇబ్బందులు తొలగించాలని కోరారు. అధికారంలో ఉన్నా, లేకున్నా రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాబు, నాయకులు భూపతిరాజు, శ్రవన్‌కుమార్ తదితరులు ఉన్నారు.

అంతరాయం ఉండొద్దు
Comments
Please login to add a commentAdd a comment