ఆస్పత్రులకు అంబులెన్స్‌లు | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రులకు అంబులెన్స్‌లు

Mar 24 2025 7:03 AM | Updated on Mar 24 2025 7:02 AM

మెదక్‌జోన్‌: మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు తన జన్మదినాన్ని పురస్కరించుకొని సొంత నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌లను ఆదివారం ఆస్పత్రులకు అందించి ఉదారత చాటుకున్నారు. మెదక్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గానికో అంబులెన్స్‌ చొప్పున ఏడింటిని హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయా జిల్లాల ప్రభుత్వాసుపత్రుల సూపరింటెండెట్లకు అందించారు. ప్రస్తుతం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ లేనందున ఎంపీ అందించిన అంబులెన్స్‌ ఎంతగానో ఉపయోగపడనుంది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌, మాజీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హవేళిఘణాపూర్‌లో వర్షం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల కేంద్రమైన హవేళిఘణాపూర్‌లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. చేతికొచ్చిన పంటలు ఏమవుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే శనివారం భారీ ఈదురు గాలులతో చెట్లు కిందపడిపోగా, వివిధ పంటలు దెబ్బతిన్నాయి.

విద్యుత్‌ సిబ్బంది సేవలు భేష్‌

పాపన్నపేట(మెదక్‌): ఇటీవల గాలి, వానకు దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలకు వెంటనే మరమ్మతులు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించిన విద్యుత్‌ అధికారులు, సిబ్బంది సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి కమిషన్‌ సభ్యుడు పట్లోల్ల శశిధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మెదక్‌ నియోజకవర్గంలో వీచిన భారీ గాలులు, వర్షానికి అనేక విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయని, వైర్లు తెగిపోయాయని చెప్పారు. అయినప్పటికీ విద్యుత్‌ శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ బాలస్వామి, ఎస్‌ఈ శంకర్‌, ఇతర సిబ్బంది వెంటనే స్పందించి మరమ్మతులు చేశారని కొనియాడారు.

నష్టపోయిన రైతులను

ఆదుకోండి: సీపీఎం

మెదక్‌ కలెక్టరేట్‌: ఎండిపోయిన, అకాలవర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నర్సమ్మ డిమాండ్‌ చేశారు. ఆదివారం పట్టణంలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండుతున్న ఎండలతో బోర్లు సరిగా పోయక పంటలు ఎండుతుంటే, అకాల వర్షం కారణంగా వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అలాగే జిల్లావ్యాప్తంగా గ్రామాల్లో ఇరుకు రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. వెంటనే రోడ్లుకు నిధులు కేటాయించి, డబుల్‌ రోడ్డు నిర్మించాలన్నారు. రాజీవ్‌ యువజన వికాస్‌ పథకానికి దరఖాస్తు సమయం తక్కువగా ఉందని, గడువు పొడిగించాలని కోరారు.

విద్యార్థులు జీవన

వైవిధ్యంపై దృష్టి సారించాలి

నర్సాపూర్‌ రూరల్‌: విద్యార్థులు, యువత గ్రామీణ జీవన వైవిధ్యంపై దృష్టి పెట్టాలని ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర మాజీ లైజర్‌ అధికారి డాక్టర్‌ భాస్కర్‌ సూచించారు. ఆదివారం నర్సాపూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏడు రోజుల ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయంతో పాటు కులవృత్తులతో జీవనం కొనసాగిస్తారన్నారు. విద్యార్థులు, యువత వారిని గౌరవించాలన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ శిబిరం సభ్యులు గ్రామీణ ప్రాంత ప్రజ లకు మూఢ నమ్మకాలు, బాల్య వివాహాలు, ప్రభుత్వ పథకాలు, మౌలిక వనరులపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దామోదర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ సురేష్‌ కు మార్‌, పీఆర్‌ఓ శ్రీనివాస్‌, అధ్యాపకులు మహేందర్‌రెడ్డి, రాజు, రాము, సుందర్‌ పాల్గొన్నారు.

ఆస్పత్రులకు అంబులెన్స్‌లు 
1
1/1

ఆస్పత్రులకు అంబులెన్స్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement