ముగిసిన కొమురవెల్లి
బ్రహ్మోత్సవాలు
కొమురవెల్లికి భక్తులు పోటెత్తారు. చివరి ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మూడు నెలలుగా కొనసాగిన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అర్ధరాత్రి నిర్వహించిన అగ్నిగుండాలతో వైభవంగా ముగిశాయి. అంతకుముందు పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. గంగిరేణు చెట్టువద్ద పట్నాలు వేసి, ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన అగ్నిగుండాలు అత్యంత వైభవంగా జరిగాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
చివరి వారం .. పోటెత్తిన భక్తజనం


