నీళ్లు లేక నెర్రెలు బారి
నర్సాపూర్‌రూరల్: పంటలు ఎండుతుండటంతో రైతులు బోరున విలపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి వరి సాగు చేస్తే చేతికందకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని అవంచ గ్రామానికి చెందిన చిగురు కృష్ణయ్య తనకున్న మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. భూగర్భజలాలు అడుగంటిపోవడంతో బోరు బావితో వరికి నీరందించలేని పరిస్థితి నెలకొంది. రెండు లక్షలు ఖర్చు పెట్టి బోరు వేయించినా చుక్క నీరు పడలేదు. దీంతో పెట్టుబడితో పాటు బోరు అప్పులు మిగిలాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారులు సన్నకారు రైతులను ఆదుకోవాలని కోరాడు.
ఎండుతున్న వరి పంటలు
బోరున విలపిస్తున్న రైతులు


