పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు

Mar 26 2025 9:16 AM | Updated on Mar 26 2025 9:16 AM

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు

పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వద్దు

డీపీఓ యాదయ్య

చిన్నశంకరంపేట(మెదక్‌): గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీఓ యాదయ్య అధికారులకు సూచించారు. మండలంలోని రుద్రారం, చందంపేట గ్రామాల్లో మంగళవారం డీపీఓ ఆకస్మికంగా పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పంచాయతీ రికార్డులు, పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. అనంతరం గ్రామ కార్యదర్శులు అనురాధ, పద్మలకు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement