రోగులకు మెరుగైన వైద్య సేవలు
మనోహరాబాద్(తూప్రాన్): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్ పీహెచ్‌సీ వైద్య బృందం, సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సేవలు, వసతుల గూర్చి రోగు లు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. నిత్యం అందుబాటులో ఉండాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. క్షయ రోగు లకు పోషణ్ కిట్లను అందించారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో వార్డులు, మందు లు, ల్యాబ్‌లను పరిశీలించారు. పలు రికార్డులతో పాటు హాజరు పట్టికను పరిశీలించి సమస్యలపై సిబ్బందిని ఆరా తీశారు. కలెక్టర్ వెంట సీఎస్‌ఓ బాల్‌నర్సయ్య, వైద్యులు తదితరులున్నారు.
జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్


