బీఆర్‌ఎస్ వెంటే ప్రజలు
నర్సాపూర్: బీఆర్‌ఎస్ పార్టీ వెంటే ప్రజలు ఉన్నారని స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. ఆదివారం పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులతో కలిసి స్థానిక చౌరస్తాలో గులాబీ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరంగల్‌లో చేపట్టిన రజతోత్సవ సభకు నాయకులు, ప్రజలు గ్రామాల నుంచి తమ అంచనాలకు మించి వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఇంకా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి పనులను మర్చిపోలేదన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారని, మళ్లీ ఆయన పాలన రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. అనంతరం ఎమ్మెల్యే పక్కనే ఉన్న హోటల్‌లో నాయకులతో కలిసి చాయ్ తాగుతూ సభకు వస్తున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు మాజీ చైర్మన్ దేవేందర్‌రెడ్డి, నాయకులు చంద్రాగౌడ్, గోపి, సంతోష్‌రెడ్డి, శేఖర్, అశోక్‌గౌడ్, నయిమోద్దీన్, భిక్షపతి, బాల్‌రెడ్డి, ప్రసాద్, జ్ఞానేశ్వర్, నర్సిహులు, రాకేశ్‌గౌడ్, నాగరాజుగౌడ్, శ్రవన్, శివకుమార్, షేక్ హుస్సేన్, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి


