
రెవెన్యూ సమస్యలు పరిష్కరించండి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
మనోహరాబాద్(తూప్రాన్): రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన జీపీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారికి పలు అంశాలపై సూచనలు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను వెంట వెంటనే పరిశీలించాలన్నారు. అలాగే సాదాబైనామా, నిషేధిత భూములు, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. సాదాబైనామా, అసైన్డ్ భూముల కోసం రెండు కమిటీలు వేశామని తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ ఆంజనేయులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.