
ఒక్కేసి పువ్వేసి చందమామ
● కలెక్టరేట్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు ● పాల్గొన కలెక్టర్, కుటుంబ సభ్యులు ● ఆడిపాడిన అధికారులు, సిబ్బంది
మెదక్ కలెక్టరేట్: కలెక్టరేట్‌లో శనివారం బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోట చేర్చి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మహిళా సిబ్బంది ఆడిపాడారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వ ర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్ ఓ భుజంగరావు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఆయాశాఖల మహిళ అధికారులు, సిబ్బందితో కలిసి నృత్యాలు చేశారు. సంబురాలకు కలెక్టర్ తల్లి తో పాటు ఆయన భార్యాపిల్లలు హాజరయ్యారు.