సకాలంలో వైద్యసేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

సకాలంలో వైద్యసేవలు అందించాలి

Sep 28 2025 8:17 AM | Updated on Sep 28 2025 8:17 AM

సకాలం

సకాలంలో వైద్యసేవలు అందించాలి

రామాయంపేట(మెదక్‌): పట్టణంలోని ప్రభు త్వ ఆస్పత్రిని శనివారం వైద్య విధాన పరిషత్‌ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ శివదయాల్‌ సంద ర్శించారు. ఈసందర్భంగా ఆయన రోగులను పరీక్షించారు. ఆస్పత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, సకాలంలో వైద్య సేవలు అందజేయాలని సూచించారు. ఆస్పత్రి లో రిజిస్టర్లు, మందులను పరిశీలించి డాక్టర్లకు సూచనలు చేశారు. ఆయన వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లింబాద్రి, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

మెదక్‌ కలెక్టరేట్‌: జిల్లాలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్నిశాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విధుల్లో నిమగ్నమై ఉంటారని, సోమవారం నిర్వహించే ప్రజావాణి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. చెరువులు తెగే పరిస్థితి ఉంటే వెంటనే చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అధికారులు హెడ్‌ క్వార్టర్‌లోనే ఉండాలన్నారు. కరెంట్‌ స్తంభాలు, రహదారుల వద్ద నీరు నిల్వ ఉంటే వెంటనే స్పందించాలన్నారు. శిథిలావస్థ ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అవసరమైన చోట పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. వాగులు, చెరువుల వద్ద ఎవరూ వెళ్లకుండా చూడాలన్నారు. వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భూసేకరణ

శాసీ్త్రయంగా జరగాలి

మెదక్‌ కలెక్టరేట్‌: రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మా ణానికి భూసేకరణ శాసీ్త్రయంగా జరగాలని సీ పీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అజ్జమర్రి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములు కోల్పోతున్న రైతులకు చట్టం ప్రకారం పరిహా రం ఇవ్వాలని, లేదంటే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, కొందరు పెద్దల కోసం అలైన్‌మెంట్‌ మార్చుతున్నట్లు ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు భూము లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రైతుల నుంచి బలవంతపు భూసేకరణ చేస్తే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతా మని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నర్సమ్మ, మల్లేశం, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి

హత్నూర(సంగారెడ్డి): సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉపాధి అవకాశాలు పొందాలని ఎమ్మెల్యే సునీతారెడ్డి తెలిపారు. హత్నూర ఐటీఐ ప్రాంగణంలో నిర్మించిన అ డ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...గతంలో ఐటీఐలో శిక్షణ పొంది ఎంతో మంది విద్యార్థులు ప్రైవేటు, ప్రభు త్వ పరిశ్రమలలో ఉపాధి అవకాశాలు పొందారన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఉద్యోగ అవకాశాలతోపాటు స్వయం ఉపాధి పొందాలని సూచించారు. రూ. కోట్లతో నిర్మించిన ఏటీసీ సెంటర్‌ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అధునాతన యంత్ర పరికరాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, హత్నూర ఐటీఐ భవనం శిథిలావస్థకు చేరగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి నిధుల మంజూరుకు కృషి చేయనున్నట్లు సూచించారు.

సకాలంలో వైద్యసేవలు అందించాలి 
1
1/1

సకాలంలో వైద్యసేవలు అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement