
మహాచండిగా దుర్గమ్మ
సోమవారం శ్రీ 29 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడుపాయల వన దుర్గమ్మ మహాచండి (కాళరాత్రి) అలంకారం, నారింజ రంగు వస్త్రాలతో భక్తులకు దర్శనమిచ్చారు. మంజీరా వరదలతో దారులు మూసేయడంతో భక్తుల సంఖ్య తక్కువగా కనిపించింది. అర్చకులు శంకరశర్మ, పార్థివశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
– పాపన్నపేట(మెదక్)
బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఒక చోట చేరారు. ‘చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మా.. ఈ వాడలోనా’.. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మా.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మా..! శ్రీ.. అంటూ ఆడిపాడారు. అనంతరం స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
– కౌడిపల్లి(నర్సాపూర్)
బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో..

మహాచండిగా దుర్గమ్మ