Veteran Actor Boman Irani Buys A Used Mercedes Benz Luxury Car; See Video - Sakshi
Sakshi News home page

Boman Irani: సెకండ్‌ హ్యాండ్ కారు కొన్న బాలీవుడ్ నటుడు.. ధర ఎన్ని కోట్లంటే!!

Published Mon, Jul 31 2023 4:11 PM | Last Updated on Mon, Jul 31 2023 7:38 PM

Actor Boman Irani buys a used Mercedes Benz Luxury car - Sakshi

ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. దాదాపు రూ.కోటి విలువైన  మెర్సిడెస్-బెంజ్‌ను కొన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.  అతని కుటుంబ సభ్యులతో కలిసి కారు డెలివరీ తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబంతో కలిసి కేక్ కట్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

(ఇది చదవండి: స్టార్‌ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్! )

అయితే బోమన్ ఇరానీ కొన్నకారు కొత్తదేం కాదు. ఇది మెర్సిడెజ్ బెంజ్ కొత్త మోడల్ అయినప్పటికీ.. ఈ కారును సెకండ్‌ హ్యాండ్‌లోనే ఆయన కొనుగోలు చేశారు. చాలా మంది సెలబ్రిటీలు ప్రీ-ఓన్డ్ కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. అలాగే అత్యాధునిక సౌకర్యాలు కలిగిన ఈ కారును బోమన్ ఇరానీ తన ఇంటికి తీసుకెళ్లారు. ఇండియాలో విరాట్ కోహ్లీతో పాటు  ప్రీ-ఓన్డ్ కారును కలిగి ఉన్న చాలా మంది ప్రముఖులు ఉన్నారు. బాలీవుడ్‌లో, శిల్పాశెట్టికి ప్రీ-ఓన్డ్ కార్లంటే చాలా ఇష్టం ఆమె దాదాపు అన్ని లగ్జరీ కార్లు సెకండ్ హ్యాండ్‌ కార్లే. కాగా.. బోమన్ ఇరానీ  అత్తారింటికి దారేది కీలక పాత్రలో కనిపించారు. 

(ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement