
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం (ఏప్రిల్ 4న) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ. వీరికి సారా, జేని, జార్జ్, జాయ్, మీరా అని ఐదుగురు సంతానం. మీరా జాస్మిన్ అందరిలో కంటే చిన్నది.
రీఎంట్రీ
మీరా జాస్మిన్.. సూత్రధారన్ అనే మలయాళ చిత్రంలో కెరీర్ ఆరంభించింది. రన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా అనేక సినిమాలు చేసింది. 2014లో దుబాయ్ ఇంజనీర్ అనిల్ జాన్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన మీరా.. గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది.
చదవండి: రౌడీ హీరో కామెంట్స్‌పై ట్రోలింగ్.. నచ్చితే చూడు, లేదంటే మానేయ్ అన్న నిర్మాత
Comments
Please login to add a commentAdd a comment