అదృష్టం గడప దాటేలోపే దరిద్రం ఊరు చుట్టొస్తుందంటారు. కొందరు నటీనటులు సినిమాల్లోకి రావడానికి పడ్డ కష్టాలను చూస్తే ఇది నిజమేననిపిస్తుంది. వెండితెర మీద కనిపించేందుకు వారు ఎదుర్కొన్న కష్టనష్టాలను చూస్తే మనసు చలించక మానదు. హిందీ నటుడు తాహీర్ రాజ్ భాసిన్ కూడా ఈ పరిస్థితిని దాటి వచ్చినవాడే. మర్దానీ సినిమాలో నటించే అవకాశం రావడానికి ముందు అతడు 250 నుంచి 300 ఆడిషన్లకు వెళ్లాడు, కానీ అంతటా మొండిచేయే ఎదురైంది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత మర్దానీలో చాన్స్ రాగా, దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడంతో చిచోరే, ఫోర్స్ 2 చిత్రాల్లోనూ అవకాశాలు చేజిక్కించుకున్నాడు.
తాజా ఇంటర్వ్యూలో తాహిర్ మాట్లాడుతూ.. "ఎన్నో కలలతో ముంబైలోకి అడుగుపెట్టాను. వారంలోనే యశ్‌రాజ్ లేదా ధర్మ ఫిలింస్ బ్యానర్‌లో సినిమా చేస్తాను అని ఊహించాను. కానీ అంతా మనం అనుకున్నట్లు ఉండదని తర్వాత తెలిసింది. నిలువ నీడ సంపాదించుకోవడానికే మూడు నెలలు పట్టింది. ఇక సినిమా అవకాశాల గురించి చెప్పేదేముంది? నాలుగేళ్లపాటు కాళ్లరిగేలా తిరిగాను. దాదాపు 250 నుంచి 300 వరకు ఆడిషన్లలో నన్ను రిజెక్ట్ చేసినా ప్రయత్నాలు మానలేదు. చిట్టచివరికి మర్దానీలో ఛాన్స్ వచ్చింది" అని తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి చెప్పుకొచ్చాడు. కాగా తాహిర్ ప్రస్తుతం క్రీడా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న '83' సినిమాలో నటిస్తున్నాడు.
చదవండి: కరోనాతో సోదరుడు మృతి; నటి భావోద్వేగం.. సోనూసూద్‌కు థాంక్స్
Comments
Please login to add a commentAdd a comment