
ప్రముఖ సినీనటి నమిత రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్నట్లు తెలిపింది. నటి నమిత దంపతులు ఆదివారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ దర్శన ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సినిమాల కంటే రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి ఉందని పేర్కొంది. సమయం చూసుకుని రాజకీయాల్లోకి అడుగుపెడతానని చెప్పుకొచ్చింది.
కాగా ఈ గుజరాతీ భామ.. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికగా దిగుమతి అయింది. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, మలయాళం వంటి ఇతర భాషా చిత్రాలలోనూ నటించింది. 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న ఆమె ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చింది.
చదవండి: సామ్- ఇనయ లవ్ భాష.. ఏంటో అర్థం కావట్లేదన్న నాగ్
ఆమె చూస్తే తట్టుకోలేదని బాత్‌రూమ్‌లో ఏడ్చేదాన్ని: హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment