
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకుంది. ఏడాది నుంచి ఓ మ్యూజీషియన్‌ని ప్రేమిస్తుండగా.. ఇప్పుడు అతడితోనే ఏడడుగులు వేసింది. కొద్దిమంది సమక్షంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరంతో పెళ్లి... తేదీ రివీల్ చేసిన హీరోయిన్)
తెలుగుతో పాటు బెంగాలీ చిత్రపరిశ్రమని కూడా టాలీవుడ్ అనే అంటారు. ఈ ఇండస్ట్రీకి చెందిన సోహిని సర్కార్.. మ్యూజీషియన్ షోవన్ గంగూలీని తాజాగా పెళ్లాడింది. జూలై 15న ఈ శుభకార్యం జరిగింది. ఈ విషయాన్ని ఇన్ స్టా ద్వారా వెల్లడించిన సోహిని.. పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. ఇందులో నూతన వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.

2013 నుంచి ఇండస్ట్రీలో ఉన్న సోహిని సర్కార్.. సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీసుల్లో హీరోయిన్‌గా చేస్తోంది. గతేడాది ఓ పార్టీలో మ్యూజీషియన్ సోవన్ గంగూలీని కలిసింది. తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు. కొన్నాళ్ల నుంచి వీళ్ల బంధంపై రూమర్స్ వస్తున్నప్పటికీ స్పందించలేదు. ఇప్పుడేమో సైలెంట్‌గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చారు. పెళ్లి ఫొటోలపై మీరు ఓ లుక్కేసేయండి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)
Comments
Please login to add a commentAdd a comment