
ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న న్యూసెన్స్ వెబ్ సిరీస్ పాజిటివ్ రివ్యూస్‌తో మంచి విజయం అందుకుంది. ప్రేక్షకులను అలరిస్తున్న ఈ వెబ్ సిరీస్ విజయం సాధించిన సందర్భంగా న్యూసెన్స్ సక్సెస్ మీట్‌ను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ ప్రవీణ్ మాట్లాడుతూ ‘‘న్యూసెన్స్ సిరీస్‌ను అందరం ఎంతో ప్రేమించి చేశాం. అందువల్లే ఇంతటి అపూర్వమైన విజయం దక్కింది. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
ఆహా, పీపుల్ మీడియా వారితో కలిసి వర్క్ చేయటం గొప్ప అనుభూతినిచ్చింది. వారు అందించిన సహాయ సహకారాలతోనే మేం అనుకున్న కథను అనుకున్నట్లు తెరకెక్కించగలిగాం’’ అన్నారు. ఈ ఆనందకర క్షణాల్లో మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. మరికొన్ని వారాల్లోనే న్యూసెన్స్ సీజన్ 2ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు. మరో ఆసక్తికరమైన, ఆలోచనను రేకెత్తించేలా ఉత్కంఠభరితమైన కథాంశంతో ముందుకు వస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment