Akhil Akkineni Next Movie: Akhil New Movie With Surender Reddy, Shooting Will Starts From February - Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలోనే షూటింగ్‌..

Jan 21 2021 8:47 AM | Updated on Jan 21 2021 9:10 AM

Akhil Akkineni New Movie Shooting Starts In February - Sakshi

యాక్షన్‌ మోడ్‌లోకి మారడానికి అఖిల్‌ రెడీ అయ్యారు. ఫిబ్రవరి నుంచి యాక్షన్‌ షురూ అంటున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ హీరోగా ఓ స్టయిలిష్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనుంది. ఇందులో భారీ మోతాదులో యాక్షన్‌ అంశాలు కూడా ఉంటాయట. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర ఈ సినిమా నిర్మించనున్నారు. ఇందులో అఖిల్‌కి జోడీగా ఎవరు నటిస్తారో ఇంకా ప్రకటించలేదు. ఈ సినిమా కోసం ప్రత్యేక వర్కౌట్స్‌ కూడా చేస్తున్నారట అఖిల్‌. రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని సమాచారం. ఎక్కువ శాతం చిత్రీకరణ ఫారిన్‌లో ఉంటుందని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement