అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్‌, కాజల్‌ టాప్‌ | Allu Arjun, Kajal Aggarwal Top From South India in Google Asian Most Search List 2021 | Sakshi
Sakshi News home page

Allu Arjun-Kajal Aggarwal: అందులో దక్షిణాది నుంచి అల్లు అర్జున్‌, కాజల్‌ టాప్‌

Published Mon, Jun 27 2022 4:02 PM | Last Updated on Mon, Jun 27 2022 5:30 PM

Allu Arjun, Kajal Aggarwal Top From South India in Google Asian Most Search List 2021 - Sakshi

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గంగోత్రి మూవీతో అల్లు వారి వారసుడిగా పరిచయమైన బన్నీ తొలి సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఇక ఆ తర్వాత ఆర్య, దేశముదురు, పరుగు, ఆర్య 2, జులాయి వంటి చిత్రాలతో స్టార్‌ హీరోగా గుర్తింపు పొందాడు. అంతేకాదు స్టైలిష్‌ స్టార్‌ అంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను కూడా క్రియేట్‌ చేసుకున్నాడు. ఆ తర్వాత సరైనోడు, డిజే, అలా వైకుంఠపురంలో చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్నాడు.

ఇక పుష్పతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇలా సినిమా.. సినిమాకు తన ఇమేజ్‌ను పెంచుకుంటు పోతున్న బన్నీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతేడాదిలో అత్యధికంగా గూగుల్‌ సెర్స్‌ చేసిన సెలబ్రెటీల జాబితాలో దక్షిణాది స్టార్స్‌లో బన్నీ టాప్‌లో నిలిచాడు. 2021లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన ఆసియా సెలబ్రెటీల జాబితాను తాజాగా గూగుల్‌ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా సెర్చ్‌ చేసిన సౌత్‌ నటుల్లో అల్లు అర్జున్‌ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాత రామ్‌ చరణ్‌ ఉ‍న్నాడు. ఇక తమిళ స్టార్‌ హీరో సూర్య కోలీవుడ్‌ నటుల్లో అగ్రస్థానంలో ఉన్నాడు.

చదవండి: క్రికెటర్‌తో లవ్‌? క్లారిటీ ఇచ్చిన ప్రియాంక జవాల్కర్‌!

హీరోయిన్లలో ‘చందమామ’ టాప్‌
ఇక హీరోయిన్లలో దక్షిణాది నుంచి చందమామ కాజల్‌ అగర్వాల్‌ టాప్‌లో ఉండగా ఆ తర్వాత సమంత, రష్మిక మందన్నాలు ఉన్నారు. బాలీవుడ్‌ నుంచి సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌లు టాప్‌లో ఉండగా.. హీరోయిన్లలో కత్రినా కైఫ్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రాలు వరుస​ స్థానాల్లో ఉన్నారు. ఇదిలా ఈ జాబితా మొత్తంలో భారత్‌ నుంచి దివంగత గాయనీ లతా మంగేష్కర్‌ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఆసియా సెలబ్రెటిల 100 మంది జాబితాల్లో లత మంగేష్కర్‌ 5వ స్థానంలో ఉన్నారు. 

చదవండి: Alia Bhatt: తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement