అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్‌ | Amitabh Bachchan Undergoing Surgery Due To Medical Condition | Sakshi
Sakshi News home page

అమితాబ్‌కు మరోసారి సర్జరీ.. ఆందోళనలో ఫ్యాన్స్‌

Published Sun, Feb 28 2021 9:57 AM | Last Updated on Sun, Feb 28 2021 11:20 AM

Amitabh Bachchan Undergoing Surgery Due To Medical Condition - Sakshi

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌(78) మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన బ్లాగులో వివరిస్తూ.. కొద్ది రోజులు బ్లాగ్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. బిగ్‌బీకి సర్జరీ అనేసరికి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్‌కు ఏమైంది.. అసలు సర్జరీ ఎందుకు? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. అలాగే బిగ్‌బీ చేయించుకోబోయే శస్త్ర చికిత్స విజయవంతం కావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ సినిమాలు చేయాలని ఆశిస్తున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

కాగా, గతంలో కూడా బిగ్‌బీకి అనేకసార్లు సర్జరీ జరిగింది. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్‌ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నారు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. అబితాబ్‌ తాజాగా నటించిన చిత్రాలలో ‘ఝుండ్’  జూన్ 18న ‘చెహ‌రే’ ఏప్రిల్‌ 30న విడుదల కానున్నాయి.  

చదవండి:
అనిల్‌తో మహేశ్‌ మరో మూవీ.. రాజమౌళి కంటే ముందే..

అలాంటి సినిమానే జాతిరత్నాలు : నాగ్‌ అశ్విన్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement