Anchor Anasuya Sensational Comments On Telugu Film Industry In Latest Interview - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Aug 18 2022 3:10 PM | Last Updated on Fri, Aug 19 2022 1:13 PM

Anasuya Bharadwaj Sensational Comments on Film Industry in Latest Interview - Sakshi

బుల్లితెరపై స్టార్‌ యాంకర్స్‌లో అనసూయ భరద్వాజ్‌ ఒకరు. తన అందచందాలతో ఫ్యాన్స్‌ మనసులను దోచేసిన ఈ బ్యూటీకి స్టార్‌ హీరోయిన్‌కు ఉన్నంత క్రేజ్‌ ఉంది. అయితే అనసూయ కేవలం బుల్లితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా దూసుకెళ్తుంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అనసూయ లైమ్‌లైట్‌లోకి వచ్చింది మాత్రం జబర్దస్త్‌ అనే కామెడీ షోతో అనే విషయం తెలిసిందే. ఇటివలె ఆమె ఈ షోకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక అ‍ప్పటి నుంచి అనసూయ వార్తల్లో నిలుస్తోంది.

చదవండి: ఎట్టకేలకు కియారాతో డేటింగ్‌పై నోరు విప్పిన సిద్ధార్థ్‌, ఏమన్నాడంటే..

ఈ క్రమంలో రిసెంట్‌గా ఆమె ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించింది. తనపై వేసే పంచులు, బాడీ షేమింగ్‌ వల్లే తాను ఈ కామెడీ షోను వీడినట్లు చెప్పింది. అనంతరం ఇండస్ట్రీలో మహిళలను ఎలా చూస్తారో వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఆడవాళ్లంటే ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. హీరోయిన్‌ అంటే కెమరా ముందు కాపాడండి.. లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి. అదే మా పని. అసలు మాట్లాడకూడదు. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్‌ ఉంది కదా.. సేమ్‌ ఇక్కడ పరిస్థితి అలానే ఉంటుంది.

చదవండి: చేతకానితనంగా చూస్తున్నారా.. బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై హీరో రియాక్షన్‌

మా హక్కుల కోసం మాట్లాడితే మమ్మల్ని తొక్కేస్తారు. హీరోయిన్‌ అంటే దేవదాసిలా పని చేయాలి అన్నట్లు చూస్తారు. కానీ అది చాలా తప్పు’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫిల్డ్‌ అంటేనే అందరిక ఆసక్తి. కానీ ఇక్కడ అందరిలాగే మేం పనిచేస్తాం. కానీ ఈ రంగుల ప్రపంచ వేరు. బయటకు కనిపించినంత హుందాగా ఉండదు. అసలు అంత దీనిలోని లోతును ఎందుకు తెలుసుకోవాలనుకుంటారు. సినీ సెలబ్రెటీల గురించి లోలుతుగా తెలుసుకోవడం వల్ల సినిమా చూడాలనే ఆసక్తేపోతుంది. అసలు మా సినిమాలు చూసే అర్హత మీకుందా అని మేం ఆలోచించడం మొదలు పెడితే.. ఎవరోస్తారు థియేటర్‌కి’ అంటూ ఘాటూ వ్యాఖ్యలు చేసింది అనసూయ. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement