
ఈతరం పాన్ ఇండియా హీరో అంటే ధనుష్ అనే చెప్పాలి. ఈయనతో చిత్రాలు చేయడానికి తమిళం, తెలుగు, హిందీ ఇలా ఏ భాషా దర్శక నిర్మాతలైనా ఇష్టపడతారు. భాష ఏదైనా విజయం పక్కా ఇదీ ధనుష్ లెక్క. ఈయనే సక్సెస్ ఫుల్ దర్శకుడు, కథకుడు, గాయకుడు. ఇక నటుడిగా చెప్పనే అక్కర్లేదు. అర్ధ సెంచరీ హీరో. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నట, దర్శక నిర్మాత ధనుష్.
ఈయన దర్శకత్వం వహించి, కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈయన నిర్మిస్తూ, స్వీయ దర్శకత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న నెలవుక్కు ఎన్ మేల్ ఎన్న కోపం చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇక తెలుగు, తమిళం భాషల్లో కథానాయకుడిగా నటిస్తున్న కుబేర చిత్రం కూడా చివరి దశకు చేరుకుంది. కాగా తాజాగా మరోసారి బాలీవుడ్ చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు, షమితాబ్, రాంజానా, అట్రాంగి వంటి హిట్ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. వీటిలో రాంజానా, అట్రాంగి చిత్రాలకు ఆనంద్ ఎల్.రాయ్ దర్శకుడు. కాగా ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ ఇప్పుడు హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నారన్నదే తాజా సమాచారం.
దీనికి తేరే ఇష్క్ మెయిన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వార్త కొద్ది నెలల క్రితమే వెలువడింది. ఆ తరువాత దీని గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా తాజాగా ఈ చిత్రం గురించి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ఇందులో నటుడు ధనుష్ సరసన యానిమల్ చిత్రం ఫేమ్ త్రిప్తి దిమ్రి నాయకిగా నటించనున్నారని తెలిసింది. అక్టోబరు నెలలో షూటింగ్‌ను ప్రారంభించి వారణాసి, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment