ప్రమోషన్స్‌కు అనుష్క దూరం? నిజమెంత? | Is Anushka Shetty Not Promoting Miss Shetty Mr Polishetty Movie? - Sakshi
Sakshi News home page

Anushka Shetty: ప్రమోషన్స్‌కు దూరంగా అనుష్క? అసలు నిజమేంటంటే?

Published Thu, Sep 7 2023 9:44 AM | Last Updated on Thu, Sep 7 2023 10:12 AM

Is Anushka Not Doing any Promotion for Miss Shetty Mr Polishetty - Sakshi

సినిమాను నిర్మించడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడం మరో ఎత్తు. అందుకు ప్రమోషన్‌ చాలా ముఖ్యంగా మారింది. దీంతో చిత్ర వర్గాలు ప్రచారానికి ప్రాముఖ్యతనిస్తున్నాయి. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు చిత్ర ప్రచారాల్లో పాల్గొనాల్సిన పరిస్థితి. బాలీవుడ్‌ స్టార్స్‌ షారూఖ్‌ ఖాన్‌, కంగనారనౌత్‌ లాంటి స్టార్స్‌ కూడా ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. షారూఖ్‌ఖాన్‌ అయితే జవాన్‌ చిత్రం కోసం దేశాన్ని చుట్టేస్తున్నారు.

హీరోయిన్‌ కంగనారనౌత్‌ తాను తాజాగా నటించిన చంద్రముఖి 2 చిత్రం కోసం చెన్నైలోనే మకాం పెట్టారు. కాగా జవాన్‌ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన నయనతార మాత్రం ఎలాంటి ప్రచారంలోనూ పాల్గొనకుండా తన పాలసీకి అలాగే కట్టుబడి ఉంది. అదే విధంగా హీరోయిన్‌ అనుష్క కూడా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటోందని ప్రచారం జరుగుతోంది. ఈమె చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి. మొన్నటివరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రమోషన్‌లోనూ అనుష్క పాల్గొనలేదు.

మయోసైటిస్‌ వ్యాధికి గురైన నమంతనే వీరికంటే బెటర్‌. అంత బాధలోనూ తాను నటించిన ఖుషీ చిత్ర ప్రచారంలో ఒక్కసారి అయినా పాల్గొందని కామెంట్లు వినిపించాయి. నిజానికి అనుష్క మొన్నటివరకు హైదరాబాద్‌లో లేదు. అందుకనే ఏ ప్రమోషన్స్‌లోనూ కనిపించలేదు. అయినప్పటికీ సోషల్‌ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తూనే ఉంది. తాజాగా సాక్షికి ఇంటర్వ్యూ ఇవ్వడంతో పాటు యాంకర్‌ సుమ ఇంటర్వ్యూకు హాజరై ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటోంది. ఇకపోతే నయనతార నటించిన జవాన్‌, అనుష్క నటించిన మిసెస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రాలు నేడు (సెప్టెంబర్‌ 7) ఒకేసారి విడుదలయ్యాయి.

చదవండి: Jawan: క్రికెట్‌ మ్యాచ్‌లో 'జవాన్‌' ప్లాన్‌: అట్లీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement