స్వీటీ అనే పేరు చెప్పగానే అందరికీ అనుష్క శెట్టినే గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి తెలుగులో మూవీస్ చేస్తోంది. 'బాహుబలి'తో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. కానీ ఆ తర్వాత ఆడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తోంది. అలాంటిది ఈమెకు కొన్నాళ్ల క్రితం ఏకంగా రూ.5 కోట్ల ఆఫర్ వచ్చిందట. కానీ దాన్ని స్వీటీ రిజెక్ట్ చేసిందట. ఇంతకీ దీని సంగతేంటి?
కన్నడ బ్యూటీ అనుష్క.. నాగార్జున 'సూపర్' సినిమాతో నటిగా మారింది. కెరీర్ ప్రారంభంలో స్పెషల్ సాంగ్స్ చేసింది. కానీ ఆ తర్వాత హీరోయిన్‌గా చిన్నా పెద్దా హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. 'బాహుబలి' ఈమెకి ఎక్కడ లేని క్రేజ్ తీసుకొచ్చింది. కానీ 'సైజ్ జీరో' మూవీ ఎప్పుడైతే చేసిందో ఈమెకు అప్పటినుంచి కష్టాలు మొదలయ్యాయి. ఈ సినిమా కోసం బరువు పెరిగింది కానీ తగ్గలేకపోయింది. దీంతో పూర్తిగా బయట కనిపించడమే మానేసింది.
(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. 'కల్కి' అది లేనట్లే?)
గత కొన్నాళ్ల నుంచి మహిళా ప్రాధాన్య చిత్రాలు చేస్తూ వస్తున్న అనుష్క.. గతేడాది 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో తలో మూవీ చేస్తోంది. ఇవి రెండు కూడా కాస్త డిఫరెంట్ మూవీస్. అయితే కొన్నాళ్ల క్రితం తెలుగు స్టార్ సినిమాలో ఆఫర్ ఈమె దగ్గరకు వచ్చిందట. రూ.5 కోట్ల రెమ్యునరేషన్ కూడా ఇస్తామన్నారట. కానీ అనుష్క నో చెప్పేసిందట.
ఇందులో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం వల్లే అనుష్క నో చెప్పిందని అంటున్నారు. దీనిబట్టి చూస్తే అనుష్క ఎన్నాళ్లు నటిస్తుందో తెలియదు గానీ ఒకవేళ యాక్ట్ చేస్తే మాత్రం పాత్ర ప్రాధాన్యమున్న మూవీసే చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏదేమైనా అనుష్క.. కోట్లు విలువ చేసే ఆఫర్ వదులుకుందనే న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'నింద' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment