స్వర్ణ కార్మికులను కించపరచలేదు : నరేశ్‌ | Bangaru Bullodu Is A entertainment Movie Naresh Says | Sakshi
Sakshi News home page

కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది – మెహర్‌ రమేశ్‌

Published Sat, Jan 23 2021 10:32 AM | Last Updated on Sat, Jan 23 2021 11:11 AM

Bangaru Bullodu Is A entertainment Movie Naresh Says - Sakshi

అల్లరి నరేశ్, పూజా ఝవేరి జంటగా గిరి పాలిక దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బంగారు బుల్లోడు’. అనిల్‌ సుంకర నిర్మాత. ఈ సినిమా నేడు విడుదల కానుంది. ప్రీ–రిలీజ్‌ వేడుకలో పాల్గొన్న దర్శకుడు మెహర్‌ రమేశ్‌ మాట్లాడుతూ – ‘‘అల్లరి’ నరేశ్‌ సినిమా అంటే కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది’’ అన్నారు. అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ ‘‘సినిమా బాగా వచ్చింది. హిట్‌ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమిది. అందర్నీ కడుపుబ్బా నవ్విస్తుంది. థియేటర్స్‌లో చూసి పెద్ద విజయం చేయాలని కోరుకుంటున్నాను. స్వర్ణ కార్మికులను కించపరిచే విధంగా మా సినిమా ఉండదు’’ అన్నారు. ‘‘కథా రచయితగా నాకు మొదట అవకాశం ఇచ్చింది ఈవీవీ సత్యనారాయణగారు. నన్ను నమ్మి ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన నరేశ్‌గారికి థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు గిరి. దర్శకుడు అజయ్‌ భూపతి, నిర్మాత దామోదర ప్రసాద్, అమ్మిరాజుతో పాటు చిత్రబృందం పాల్గొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement