స్వస్థలం: హైదరాబాద్
పుట్టిన తేదీ: 25 జనవరి 1993
విద్యార్హత: గ‌్రాడ్యుయేట్
వృత్తి: యాంకర్
జెమిని కామెడీ యాంకర్ అంటే అందరూ గుర్తు పడతారో లేదో! కానీ రామ్‌గోపాల్ వర్మతో ఇంటర్వ్యూ చేసి ఆయన మనసు దోచుకున్న యాంకర్ అంటే ఇట్టే గుర్తుపడతారు. ఆ మధ్య ఆర్జీవీ అరియానా గ్లోరీ అంటే తనకు చాలా ఇష్టమని ట్విటర్‌లో ప్రకటించారు. అప్పటినుంచి ఆమె బాగా పేరు బాగా ప్రచారమైంది. కాగా 2015లో ఆమె యాంకర్‌గా కెరీర్‌గా ప్రారంభించింది. ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లలోనూ ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
యూట్యూబ్‌లో సినిమా సెలబ్రిటీలను, టిక్‌టాక్ స్టార్లను కూడా ఇంటర్వ్యూ చేసింది. అందంతోపాటు, వాక్చాతుర్యంతో కుర్రకారు గుండెలను కొల్లగొడుతోంది. మరి బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీకి ఆర్జీవీ నుంచి ఫుల్ సపోర్ట్ దొరకడం ఖాయం. మనుషుల్ని చూసి వాళ్లేంటో చెప్పేస్తానంటున్న ఈవిడ కంటెస్టెంట్ల మనసులో కూడా ఏముందో ముందే తెలుసుకుంటారో లేదో చూద్దాం. స్పెషల్ కేటగిరీ కింద ఈమెను నటుడు సోయెల్‌తో కలిసి ప్రత్యేక గదిలో ఉంచారు.
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment