
‘మా అమ్మ మీద ఒట్టు.. నాకు ఆ విషయం తెలియదు. అయినా దీప్తి అలా చెప్పి ఉండదు
బుల్తి తెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్‌గా సన్నీ గెలుపొందగా, రన్నరప్‌గా యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే షో స్టార్టింగ్ నుంచి విన్నర్ రేసులో షణ్ముఖ్ ముందు ఉన్నాడు. ఈ సారి కప్పు షణ్ముఖ్‌కే అని అంతా ఊహించారు. అంతేస్థాయిలో షణ్ముఖ్ ప్రతిసారి ఎలిమినేషన్ ఉన్నా.. బయపడకుండా, తన వేలో గేమ్ ఆడుతూ వచ్చాడు. అందరి గేమ్‌ని అంచనా వేస్తూ బిగ్‌బాస్ బ్రహ్మగా పేరు పొందాడు. కానీ చివరికి టైటిల్‌కి అడుగు దూరంలో ఆగి.. రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే తనది రెండో స్థానం అని షణ్ముఖ్‌కి తన ప్రియురాలు చెప్పినట్లు వార్తలు వినిపించాయి.
#SoulOfBB5VJSunny GUYS LEAK EECHIDHI DEEPTHI SUNAINA pic.twitter.com/KBCsfhqe1G
— Ryukendo Ryuke (@RyukendoR) November 28, 2021
నవంబర్ 27న జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌కి షణ్ముఖ్ ప్రియురాలు దీప్తి సునైనా వెళ్లింది. ఈ సందర్భంగా ఆమె రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకొని తను రెండో స్థానంలో ఉన్నాడని చెప్పిందంటూ... ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. తాను అలా చేయలేదని దీప్తి క్లారిటీ ఇచ్చినప్పటికీ.. నెటిజన్స్‌లో మాత్రం దీప్తి ముందే చెప్పిందని అభిప్రాయపడ్డారు. తాజాగా ఈ విషయంపై షణ్ముఖ్ క్లారిటీ ఇచ్చాడు. అరియానా గ్లోరీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్‌బాస్ బజ్ షోలో పాల్గొన్న షణ్ముఖ్.. ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మా అమ్మ మీద ఒట్టు.. నాకు ఆ విషయం తెలియదు. అయినా దీప్తి అలా చెప్పి ఉండదు. ఒకవేళ నిజంగానే తను అలా చెప్పి ఉంటే సిరితో ఫ్రెండ్‌షిప్ ఎందుకు కంటిన్యూ చేస్తా? నా పొజిషన్ గురించి నాకు ముందే తెలుసు. 11వ వారంలోనే సన్నీ విజేత, నేను రన్నరప్ అని ఊహించా. అంతేకానీ దీప్తి మాత్రం నాకు ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు.
(చదవండి: : షణ్ను లేకపోయుంటే సిరి టాప్ 5లో ఉండేదే కాదు: శ్రీరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు)