Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Shocking Hint To Shanmukh In Weekend Episode - Sakshi
Sakshi News home page

Deepthi Hint To Shanmukh: షణ్ముఖ్‌కి దీప్తి సూపర్‌ హింట్‌.. అందుకే మైక్‌ని అలా పట్టుకుందా?

Published Sun, Nov 28 2021 1:53 PM | Last Updated on Sun, Nov 28 2021 2:30 PM

Bigg Boss 5 Telugu: Deepthi Sunaina Gives Super Hint To Shanmukh Jaswanth - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో శనివారం ఎపిసోడ్‌ కొంచెం ఎమోషనల్‌గా, కొంచెం జాయ్‌ఫుల్‌గా సాగింది. కంటెస్టెంట్స్‌కు మరోసారి కుటుంబ సభ్యులను చూపించి, సంతోషపరిచాడు హోస్ట్‌ నాగార్జున. అయితే దీని కోసం శాక్రిఫైజ్ టాస్క్‌ ఇచ్చాడు.  హౌస్ మేట్స్ ఇష్టమైన వస్తువులని త్యాగం చేస్తే వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో, లేదా ఫ్రెండ్స్ తో కలుసుకోవచ్చని చెప్పాడు. దీంతో అందరూ తమ వస్తువులని త్యాగం చేసి వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ తో మాట్లాడారు.

ఇక షణ్ముఖ్‌ కూడా తన ప్రియురాలు దీప్తి సునైనా ఇచ్చిన టీషర్ట్‌ని త్యాగం చేయడంతో అతని అన్నయ్య స్టేజ్‌ మీదకు వచ్చాడు. ఆ తర్వాత దీప్తి కూడా రావడంతో షణ్ముఖ్‌ ఆనందంతో ఉబ్బితబ్బిపోయాడు. ఇక షణ్ణుతో మనసు విప్పి మాట్లాడిన దీప్తి.. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని సూచించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. దీప్తి తెలివిగా షణ్ముఖ్‌కి ఓ హింట్‌ ఇచ్చిందని  సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుంది. అంటే తను రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

అలాగే‘సచ్చినోడా’అని ప్రేమగా అంటూనే వేళ్లతో సైగలు చేసింది. ఇక షణ్ముక్ కూడా వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడు.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. అంతేకాదు, గ్రాండ్ ఫినాలే లో కలుద్దాం అంటూ మరో హింట్‌ కూడా ఇచ్చింది. మూడు వారాల వరకు ఇక్కడే ఉండూ.. బయటకు రావడం అనేది నాకు నచ్చదని చెప్పింది. దీనికి షణ్ముఖ్‌ ముసి ముసి నవ్వులు నవ్వుతూ.. నువ్వు ఉన్నావ్‌ కదా దీపూ..  నేను ఇప్పుడప్పుడే రానులే అన్నాడు. మొత్తానికి దీప్తి చాలా తెలివిగా షణ్ముఖ్‌కి హింట్‌ ఇచ్చిందని నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ మూడు వారాల్లో తన ఆట తీరును మార్చుకొని విన్నర్‌ అవుతాడా లేదా అనేది చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement