
బిగ్‌బాస్ హౌస్‌లో శనివారం దీప్తి సునైనా సందడి చేసిన విషయం తెలిసిందే. ప్రియుడి షణ్ముఖ్ కోసం బిగ్‌బాస్ షోకి వచ్చిన దీప్తి.. తనదైన మాటలతో షన్నూతో పాటు అందరికి బూస్ట్ ఇచ్చింది. అలాగే ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్ అయిపోవద్దని ప్రియుడికి సలహా ఇచ్చింది. అంతటితో ఆగకుండా మూడు వారాల వరకు ఇక్కడే ఉండూ అంటూ ముద్దుల వర్షం కురిపించింది.
(చదవండి: బిగ్‌బాస్: షణ్ముఖ్‌కి దీప్తి సూపర్ హింట్..తన పొజిషన్ ఏంటో చెప్పిందా?)
అయితే ఇదే సమయంలో షణ్ముఖ్‌కు దీప్తి ఓ హింట్ ఇచ్చిందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆమె స్టేజ్ మీదకు వచ్చిరావడంతోనే రెండు వేళ్లతో మైక్‌ని పట్టుకుంది. అంటే షణ్ముఖ్ రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. షణ్ముక్ కూడా దీప్తి వేళ్ల వైపు చూసి చూడనట్లుగా చూశాడని, ఆమె పక్కా ప్లాన్ ప్రకారమే హింట్ ఇచ్చిందని దానికి సంబంధించిన వీడియోని వైరల్ చేస్తున్నారు.
#SoulOfBB5VJSunny GUYS LEAK EECHIDHI DEEPTHI SUNAINA pic.twitter.com/KBCsfhqe1G
— Ryukendo Ryuke (@RyukendoR) November 28, 2021
తాజాగా ఈ వైరల్ వీడియోపై దీప్తి సునైనా స్పందించింది. నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయనంటూ తన ఇన్‌స్టా స్టోరీతో ఓ పోస్ట్‌ని పెట్టింది. ‘మీ బొందరా మీ బొంద.. నా జీవితంలో ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్రయోగించను. షణ్ముఖ్ విషయంలోనే కాదు.. నా లైఫ్‌లో దేనికోసం అలాంటి పనులు చేయను. నా దృష్టిలో షణ్ముఖే బిగ్‌బాస్ విన్నర్’అని దీప్తి చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment