
యూట్యూబ్ స్టార్, బిగ్‌బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైనాలు ఎప్పటి నుంచో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. బయట దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ షణ్ముఖ్‌ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను పోస్ట్ చేస్తూ భారీ ఓట్లు పడేలా చేస్తోంది.
షణ్ముఖ్ కూడా ప్రతిసారి దీప్తిని తలచుకుంటూ, ఆమె పంపించిన గిప్ట్‌ను చూస్తూ మురిసిపోతుంటాడు. దీంతో త్వరలోనే దీప్తి, షణ్ముఖ్ పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో షణ్ముఖ్ తల్లి ఉమారాణి ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీప్తి-షణ్ముఖ్‌ల రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
షణ్ముఖ్, దీప్తిలు ఫ్రెండ్సేననీ, వారిద్దరు కలిసి చేసిన సాంగ్స్‌కి మంచి స్పందన వచ్చిందని, దీంతో చాలా మంది జోడి అంటుంటారని తెలిపింది. వాళ్లిద్దరికీ ఇష్టం అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాకపోతే రెండు ఫ్యామిలీలు మాట్లాడుకొని వాళ్ల ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తామని చెప్పారు. ఇప్పుడు వాళ్లది చాలా చిన్న వయసని, ఇప్పడేం తొందరలేదన్నారు. దీప్తితో ప్రేమ విషయాన్ని షన్నూ ఏ రోజు కూడా తమ దగ్గర చర్చించలేదని.. తమ ఫ్యామిలీలు మాట్లాడుకుని వాళ్ల ఇష్టానికి తగ్గట్టుగానే చేస్తామని చెప్పుకోచ్చింది. మొత్తానికి షణ్ముఖ్, దీప్తిల పెళ్లికి ఉమారాణి పరోక్షంగా ఒప్పుకోవడం పట్ల ఇద్దరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment