
Shanmukh Parents Reaction on Shannu And Deepthi Marriage: బిగ్‌బాస్ -5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్-దీప్తి సునైనాల ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. తామిద్దరం ప్రేమలో ఉన్నామని బహిరంగంగానే చెప్పుకున్నారు. షణ్ముఖ్ అయితే బిగ్‌బాస్ హౌస్‌లో దీప్తిని తలచుకోని రోజంటూ ఉండదు. హౌస్‌లోకి తన తల్లి వచ్చినప్పుడు కూడా దీప్తి గురించే ఆరా తీశాడు షణ్ముఖ్. ఇక షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే.. బయట దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ నిర్వహిస్తూ షణ్ముఖ్‌ని బిగ్ బాస్ విన్నర్‌ని చేయడానికి గట్టిగానే కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షణ్ముఖ్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోలను పోస్ట్ చేస్తూ భారీ ఓట్లు పడేలా చేస్తోంది.
వీరిద్దరు తమ ప్రేమను బహిర్గతం చేయడంతో.. పెళ్లి ఎప్పుడు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రతి ఇంటర్వూలోనూ ఇరు కుటుంబ సభ్యులను కూడా ఇదే ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షణ్ముఖ్-దీప్తి పెళ్లి విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షణ్ముఖ్ తల్లిదండ్రులు. వారి ప్రేమ గురించి తమకు ముందుగా తెలియదని, టీవీలో చూసిన తరవాతే తెలిసిందన్నారు.
‘దీప్తిని ప్రేమిస్తున్నట్లు షణ్ముఖ్ మాతో చెప్పలేదు. వాళ్లు యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు.. మంచి ఫ్రెండ్స్ అనే అనుకున్నాం.. కానీ టీవీ షోలకు వెళ్లడం.. టాటూలు వేయించుకోవడం ఇవన్నీ చూసి.. లవ్‌లో ఉన్నారని తెలిసింది. మేం కూడా టీవీలో చూసే తెలుసుకున్నాం. ఆ తరువాత షణ్ముఖ్ విషయం చెప్పాడు.. అప్పుడు కూడా ఫ్రెండ్స్ అనే చెప్పాడు. షణ్ముఖ్‌కి ఇష్టం అయితే మాకు ఇష్టమే. కానీ దీప్తి సునయన పేరెంట్స్‌కి ఓకే అయితేనే మాకు ఓకే.. వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేయం. వాళ్ల పేరెంట్స్ వీళ్లు చెప్పారో లేదో కూడా మాకు తెలియదు. . మా అబ్బాయి ఇష్టాన్ని మేం కాదనం.. వాడి పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. షణ్ముఖ్ అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదు.. ముందు వాడి పెళ్లి కావాలి. షణ్ముఖ్ పెళ్లికి ఇంకో మూడునాలుగేళ్లు పడుతుంది’అని షణ్ముఖ్ తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment