బిగ్‌బాస్... బుల్లితెరపై ఈ రియాల్టీ షోకి ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ భాషలోనైనా సరే బిగ్‌బాస్ షో మొదలైందంటే చాలు.. అభిమానుల సంబరాలు ఆకాశాన్నంటుతాయి. ఇక తెలుగులో అయితే బిగ్‌బాస్ షోకు సీజన్ సీజన్‌కు ఆదరణ పెరుగుతోంది. బిగ్‌బాస్ నాల్గో సీజన్ గగతేడాది డిసెంబర్ 20న గ్రాండ్‌గా ముగిసిన సంగతి తెలిసిందే.
కరోనా లాక్ డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితం అయిన వారికి 105 రోజుల పాటు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ ఇచ్చింది బిగ్‌బాస్-4. ఆ సీజన్‌లో ఎక్కువగా కొత్త ముఖాలే ఉన్నప్పటికీ నాగార్జున తన అనుభవంతో షోని రక్తి కట్టించాడు. ఇక నాల్గో సీజన్ కూడా సూపర్ హిట్ కావడంతో ఆ ఉత్సాహంతోనే త్వరలోనే ఐదో సీజన్‌తో ముందుకు రాబోతున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా ఇప్పటికే సెట్ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక తుది దశకు చేరుకున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ షోకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం బిగ్‌బాస్ ఐదో సీజన్‌కి కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించడంలేదట. ఆయన స్థానంలో టాలీవుడ్ యంగ్ హీరో దుగ్గుబాటి రానా హోస్ట్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం.గత రెండు సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన కింగ్ నాగార్జున.. ఐదో సీజన్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట. అందుకే వరుస సినిమాలను కూడా ప్రకటించాడు. నాగ్ తప్పుకోవడంలో బిగ్‌బాస్ నిర్వాహకులు పలువురు యంగ్ హీరోలను సంప్రదించారట. ఈ క్రమంలో రానా దగ్గుబాటిని ఫైనల్ చేశారట. రానా గతంలో ‘నెంబర్ వన్ యారీ’అనే షోకి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ అనుభవంలోనే బిగ్‌బాస్ 5 సీజన్‌కి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
చదవండి:
‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్స్‌కి ఇక పండగే
Comments
Please login to add a commentAdd a comment