Bigg Boss 6 Telugu Season: Nagarjuna Announce Golden Opportunity for Common People - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బంపరాఫర్‌, సామాన్యులకు బిగ్‌బాస్‌ షోలో పాల్గొనే ఛాన్స్‌

Published Thu, May 26 2022 11:32 AM | Last Updated on Thu, Sep 1 2022 2:00 PM

Bigg Boss 6 Telugu: Nagarjuna Announce Golden Opportunity to Grab Ticket to BB 6 - Sakshi

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో మెచ్చే రియాలిటీ షో బిగ్‌బాస్‌. సెలబ్రిటీలందరినీ ఒకేచోట చూడటం ప్రేక్షకులకు కన్నులపండగగా ఉంటుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో వారు గేమ్స్‌ ఆడుతుంటే బయట వారిని గెలిపించేందుకు ఫ్యాన్స్‌ కష్టపడుతుంటారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ వార్‌ కూడా జరుగుతుంటాయి. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ షోలో ఇలాంటి ఫ్యాన్స్‌ వార్‌లకు లెక్కే లేదు. 

ఇదిలా ఉంటే త్వరలో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ మొదలు కాబోతోంది. ఇందులో యాంకర్‌ శివ, శ్రీరాపాక వంటి పలువురు కంటెస్టెంట్లు పాల్గొననున్నారంటూ అప్పుడే ప్రచారం మొదలైంది. ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈసారి కామన్‌ మ్యాన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టొచ్చు అంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు మేకర్స్‌. ఈమేరకు ఓ ప్రోమో కూడా వదిలారు.

ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ సీజన్‌ 6లో సామాన్యులకు ఇంట్లోకి ఆహ్వానం.. ఇన్నాళ్లు మీరు బిగ్‌బాస్‌ షోను చూశారు, ఆనందించారు. ఆ ఇంట్లో ఉండాలనుకుంటున్నారు కదూ, అందుకే స్టార్‌ మా ఇస్తోంది.. ఆకాశాన్ని అందుకునే అవకాశం! వన్‌ టైం గోల్డెన్‌ ఛాన్స్‌.. టికెట్‌ టు బిగ్‌బాస్‌ సీజన్‌ 6. మరిన్ని వివరాల కోసం స్టార్‌ మా వారి వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అవండి అని చెప్పుకొచ్చాడు. మరి మీకు కూడా బిగ్‌బాస్‌ హౌస్‌కి వెళ్లాలని ఉంటే వెంటనే starmaa.startv.com ఓపెన్‌ చేసి మీ వివరాలు నమోదు చేసుకోండి.

చదవండి: విడాకుల తర్వాత కలిసి కనిపించిన మాజీ స్టార్‌ కపుల్‌
బిగ్‌బాస్‌ షో ద్వారా బిందుమాధవి ఎంత వెనకేసిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement