
సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉన్నప్పటికీ పెద్దల ఇష్టం ప్రకారం ముందు చదువు పూర్తి చేసింది. వరంగల్ నిట్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. తర్వాత తనకు ఇష్టమైన నటనను కెరీర్‌గా ఎంచుకుంది. అందుకు బిగ్‌బాస్ షోను వేదికగా ఏర్పాటు చేసుకుంది.
తాజాగా హౌస్‌లో రెండో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఊ అంటావా మావా పాటతో స్టేజీని హడలెత్తించింది. రావడంతోనే ప్రియాంక, శోభా శెట్టి సరిగా ఆడట్లేదని తెలిపింది. తానొక కిక్ బాక్సర్ అంటున్న అశ్విని శ్రీ తనతో ఎవరైనా గొడవపడితే కొట్టేస్తానంటోంది. మరి బిగ్‌బాస్ హౌస్‌లోనూ ఇదే జోష్ కంటిన్యూ చేస్తుందా? లేదా? చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment