
Bigg Boss Beauty Ashu Reddy Focus Movie Coming In March: బిగ్‌బాస్‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది అషూ రెడ్డి. తన బోల్డ్నెస్తో బోల్డ్ బ్యూటీగా అభిమానులకు మరింత దగ్గరైంది. ఈ ముద్దుగుమ్మ, విజయ్ శంకర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఫోకస్'. ఇందులో సుహాసినీ మణిరత్నం కీలకపాత్రలో నటించనున్నారు. జి. సూర్యతేజ దర్శకత్వంలో స్కైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మార్చిలో విడుదల కానుంది.
‘‘మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రమిది. విజయ్ శంకర్ పోలీసాఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో సుహాసినీ జడ్జ్ పాత్రలో అలరించనున్నారు. త్వరలోనే మా సినిమా టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment