Bigg Boss Telugu 6: Arohi Rao Gives Strong Counter To Netizen - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నీకు బిగ్‌బాస్‌ ఎందుకు? అన్న నెటిజన్‌కు ఆరోహి కౌంటర్‌

Published Sat, Oct 22 2022 8:30 PM | Last Updated on Mon, Oct 24 2022 1:38 PM

Bigg Boss Telugu 6: Arohi Rao Gives Strong Counter To Netizen - Sakshi

యాంకర్‌ ఆరోహి రావు... తెలంగాణ యాసలో గలగలా మాట్లాడే ఈమె బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌తో ఎంతోమందికి చేరువైంది. ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడే తత్వం, తప్పనిపిస్తే ఎంత పెద్ద గొడవకైనా సరే రెడీ అంటూ కొట్లాటకు దిగే నైజం చాలామందిని ఆకట్టుకుంది. కానీ అదే సమయంలో సూర్యతో చేసిన ఫ్రెండ్‌షిప్‌ చాలామందికి నచ్చలేదు. మీది స్నేహమా? వేరే ఇంకేదైనానా? అని అందరూ ఆరా తీసినప్పుడు కూడా దానికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. నిజానికి వాళ్లిద్దరిదీ ఫ్రెండ్‌షిప్పే కానీ ఇలా తమ మధ్య ఏదో ఉందన్నట్లు సస్పెన్స్‌ పెడితే బాగుంటుందనుకున్నారు. తీరా వారి ప్లాన్‌ బోల్తా కొట్టింది. ఆరోహి బొక్క బోర్లా పడింది.

మీ ఫ్రెండ్‌షిప్‌ హద్దులు మీరిందని పలువురు నెటిజన్లు ఆరోహిని ట్రోల్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి 'నీకు పొలం పనే కరెక్టే.. బిగ్‌బాస్‌ ఎందుకు? పో పోయి పొలం పని చేస్కో' అని అవహేళన చేశాడట. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో షేర్‌ చేసిన ఆరోహి ఆ కామెంట్‌కు దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చింది. తమ్మీ.. ఆ పొలాల్లో పని చేసేటోళ్లు లేకపోతే నువ్వు అడుక్కు తినాలన్నా అన్నం దొరకదు అని కౌంటరిచ్చింది.

చదవండి: రేవంత్‌కు నాగ్‌ క్లాస్‌, అడ్డంగా దొరికేసిన శ్రీసత్య
బిగ్‌బాస్‌: ఏడో వారం అతడు ఎలిమినేట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement