
ప్రత్యేక గీతాలకు పెట్టింది పేరు బిందు. బాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించి, తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది బిందు. దాదాపు 40 ఏళ్లపాటు ఇండస్ట్రీకి తన సేవలందించిన ఆమె తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.
'మా పొరుగింట్లో ఉండే చంపక్ లాల్ జవేరీ, నేను 15 ఏళ్ల వయసులోనే ప్రేమించుకున్నాం. 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాం. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వలేదు. ఎందుకంటే పెళ్లి వల్ల నా వర్క్ డిస్టర్బ్ అవ్వద్దనుకున్నాను. 1979లో దొ రాస్తే సినిమా ఆఫర్ వచ్చింది. అప్పుడు మా ఆయనుండి.. మనం ఆర్థికంగా సెటిలయ్యాం కదా, ఇప్పుడిది అవసరమా? అన్నారు. కానీ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఉందని చెప్పడంతో మరేం మాట్లాడలేదు. నాకు అండగా నిలబడ్డారు.
నేనెప్పుడూ ఏ పార్టీకి ఒంటరిగా వెళ్లలేదు. అతడితో కలిసే పార్టీలకు హాజరయ్యేదాన్ని. అలాగే లేట్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయేవాళ్లం. తను నా విషయంలో ఎప్పుడూ అభద్రతకు లోనవలేదు. నేను తనను ఎంత ప్రేమిస్తున్నానో ఆయనకు తెలుసు. అందుకే నాపై పూర్తి నమ్మకం ఉంచారు.' అని చెప్పుకొచ్చింది నటి. కాగా బిందు దాదాపు 160 చిత్రాల్లో నటించింది. కటి పతంగ్, ఇత్తేఫక్, దో రాస్తే, అభిమాన్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆమె చివరగా 2008లో వచ్చిన మెహబూబా సినిమాలో కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment