చిన్న సినిమాలపై పెద్దగా అంచనాలు ఉండవు. కొన్ని మూవీస్ అలా థియేటర్లలోకి వచ్చి సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి చిత్రమే 'ద బర్త్ డే బాయ్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో ఒకరిద్దరు మినహా దాదాపు కొత్త వాళ్లే నటించారు. దర్శకుడి ఫేస్ అయితే ఇప్పటివరకు బయటపెట్టలేదు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
బాలు, అర్జున్, వెంకట్, సాయి, సత్తి అనే కుర్రాళ్లు. అమెరికాలో చదువుకుంటూ ఉంటారు. వీళ్లలో బాలు పుట్టినరోజుని బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ సెలబ్రేషన్స్‌లో బర్త్ డే బంప్స్ అని చెప్పి బాలుని ఎలా పడితే అలా కొడతారు. నొప్పి తట్టుకోలేక బాలు చనిపోతాడు. ఉన్నది అమెరికా కావడంతో కుర్రోళ్లు భయపడతారు. వీళ్లందరూ అర్జున్ సోదరుడు భరత్ (రవికృష్ణ)ని పిలుస్తారు. లాయర్ అయిన ఇతడు.. చనిపోయిన బాలు తల్లిదండ్రులకు విషయం చెప్పి అమెరికా రప్పిస్తాడు. ఇంతకీ బాలు చనిపోయాడా చంపేశారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ప్రియదర్శి 'డార్లింగ్' సినిమా రివ్యూ.. ఎలా ఉందంటే?)
ఎలా ఉందంటే?
రియల్ లైఫ్ సంఘటన ఆధారంగా 'ద బర్త్ డే బాయ్' మూవీ తీశారు. సూటిగా సుత్తి లేకుండా మొదలైన పావుగంటకే స్టోరీలోకి తీసుకెళ్లిపోయిన దర్శకుడు.. శవంతో సినిమా అంతా నడిపించి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లస్ థ్రిల్ అందించాడు. బర్త్ డే బంప్స్ పేరుతో కుర్రాళ్లు చేసే హడావుడి చాలా సహజంగా ఉంది. ఓవైపు డెడ్ బాడీనే స్టోరీలో మెయిన్ అయినప్పటికీ మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్‌ని కూడా క్యారీ చేసిన విధానం బాగుంది.
ఫస్టాప్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం ఆకట్టుకుంటాయి. రెండు గంటల సినిమానే అయినప్పటికీ.. కొన్ని సీన్ల వల్ల సాగదీసినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ చూస్తున్నంతసేపు భలేగా ఉంటుంది. తీసింది కొత్త డైరెక్టరేనా అని సందేహం వస్తుంది. స్టోరీ అంతా అమెరికాలో జరుగుతున్నట్లు రాసుకున్నారు. కానీ తీసింది ఇండియాలోనే అని చూస్తుంటే తెలిసిపోతుంది. బడ్జెట్ పరిమితుల వల్లనో ఏమో అమెరికా సెటప్ ఇండియాలోనే వేసుకున్నారు!
ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో నటించిన వాళ్లంతా కొత్త వాళ్లే. అయినా సరే చాలా నేచురల్‌గా చేసుకుంటూ వెళ్లిపోయారు. రవికృష్ణ, రాజీవ్ కనకాల, సమీర్.. ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు. వీళ్లు తమతమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. విజువల్స్ బాగున్నాయి. ఓ సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంది. సింక్ సౌండ్ వల్ల సినిమా చూస్తున్నంతసేపు మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. పేరుకే చిన్న మూవీ గానీ బాగానే ఖర్చు చేసినట్లు అర్థమైంది. బర్త్ డే పార్టీల పేరిట బంప్స్ అని చెప్పి ఎలాపడితే అలా కొడుతూ ఎంజాయ్ చేసేవాళ్లు కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది.
(ఇదీ చదవండి: టీమిండియా క్రికెటర్ గిల్‌తో పెళ్లి? సిగ్గుపడుతూనే హీరోయిన్ క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment