
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ తాజాగా కొత్త ఫ్లాట్లు కొనుగోలు చేసింది. ముంబైలోని జుహులో మరో రెండు ఫ్లాట్లను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. స్క్వేర్‌ఫీట్ ఇండియా డాట్ కామ్ కథనం ప్రకారం ముంబైలోని జుహులో ఆమె నివసిస్తున్న శివశక్తి బంగ్లాకు సమీపంలోనే రెండు లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకుంది. ఈ ఫ్లాట్లు సదరు భవనంలోని పదవ అంతస్థులో ఉన్నాయి. 2000 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న ఆ ఫ్లాట్ల ధర సుమారు 12 కోట్ల రూపాయలని సమాచారం.
ఈ ఏడాది ప్రారంభంలోనే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా పూర్తైపోయిందట! ఇదిలా ఉంటే కాజోల్ భర్త అజయ్ దేవ్‌గణ్ కూడా గతేడాది జుహులో రూ.60 కోట్లు విలువ చేసే బంగళాను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే! కాగా కాజోల్ చివరగా నెట్‌ఫ్లిక్స్‌లో 'త్రిభంగ' సినిమాలో కనిపించింది. ఇందులో మిథిలా పాల్కర్, తన్వి అజ్మీ, మానవ్ గోహిల్, కునాల్ రాయ్ కపూర్ తదితరులు నటించారు. ప్రస్తుతం ఆమె రేవతి దర్శకత్వంలో 'సలాం వెంకీ' సినిమా చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment