
బాలీవుడ్ నటి చిత్రాశి రావత్ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, నటుడు, వాయిస్ ఆర్టిస్ట్ ధృవాదిత్య భగ్వనానీని పెళ్లాడింది. ఛత్తీస్‌ఘడ్‌లో శనివారం ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంటోంది నటి. ప్రస్తుతం వీరి హల్దీ, మెహందీ, పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా చిత్రాశి రావత్ షారుక్ ఖాన్ 'చక్ దే ఇండియా' సినిమాలో హాకీ ప్లేయర్ కోమల్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ధ్రువ్‌తో బిలాస్‌పూర్‌లో మా పెళ్లి జరగబోతోంది. డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని సింపుల్‌గా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment