
చేతన్ చీను, బన్నీవోక్స్ జంటగా నటించిన చిత్రం ‘విద్యార్థి’. మధు మాదాసు దర్శకత్వంలో మహాస్ క్రియేషన్స్ పతాకంపై ఆళ్ల వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 29న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో కాన్సెప్ట్ పోస్టర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మధు మాదాసు మాట్లాడుతూ.. ‘‘దర్శకుడిగా తొలి చిత్రమిది. చాలాకష్టపడి తీశాం. ఎక్కడా బ్రేక్ లేకుండా సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేశాం. కాకపోతే కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. డి.ఎస్.రావు సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఈ నెల 29న విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు.