Megastar Chiranjeevi Fulfilled His Fan Last Wish - Sakshi
Sakshi News home page

Chiranjeevi: అభిమాని చివరి కోరిక తీర్చిన మెగాస్టార్‌!

Published Mon, Aug 8 2022 7:22 PM | Last Updated on Mon, Aug 8 2022 7:45 PM

Chiranjeevi Fulfills His Fan Last Wish - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి.. సెలబ్రిటీలనే కాదు ఫ్యాన్స్‌ను సైతం ఆత్మీయంగా పలకరిస్తారు. అభిమానికి ఆపద వస్తే అండగా నిలబడతాడు. తాజాగా చిరు తన అభిమాని కోరికను నెరవేర్చాడు. మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం కాస్తా ఆయన దాకా చేరింది.

వెంటనే తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించాడు. మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కాసేపు అభిమానితో మాట్లాడి ఆయనకు మానసిక స్థైర్యాన్ని అందించాడు. అంతేకాక ఆర్థిక సహాయం కూడా కల్పించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా చిరు మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేపోతున్నారు నెటిజన్లు.

చదవండి: 'బింబిసార'లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా?
మూడు రోజుల్లో సీతారామం ఎంత రాబట్టిందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement