సాక్షి, హైదరాబాద్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. హైపర్ ఆది తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచాడు.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో హైపర్ ఆది దీనిపై స్పందిస్తూ.. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు. స్క్రిప్ట్ నేను రాయలేదు.. నేను కేవలం ఆర్టిస్ట్‌ను మాత్రమే అని తెలిపారు.
టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో ఆది.. తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా మాట్లాడారని తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్‌బీ నగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment